ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదం బాధాకరం

  • 5 లక్షల ఎక్స్ గ్రేషియా  ప్రకటించిన సీఎం జగన్ 
  •  2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై  ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ,2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఘటన జరగడం బాధాకరమన్నారు.

 తెలుగులో ట్వీట్ చేసిన పీఎంవో
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు ప్రధాని మోడీ. ఇదే విషయాన్ని ప్రధాని కార్యాలయం (PMO) తెలుగులో ట్వీట్ చేసింది. 
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా : సీఎం జగన్
బస్సు  వాగులో పడిపోయిన దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ స్పందించి అధికారులతో ఆరా తీశారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. జంగారెడ్డి గూడెం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు వంతెనపై నుంచి వాగులో పడిన దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతున్న ఆర్టీసీ బస్సు  ప్రమాదానికి గురైంది.