ఏపీలో ఎన్నికల సమరం క్లైమాక్స్ కి చేరుకుంది. కాసేపట్లో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనున్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ కూటమికి చెక్ పెట్టే విధంగా పావులు కదుపుతున్నారు. మొదటి నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్ తన చివరి ప్రచార సభను పిఠాపురంలో ప్లాన్ చేశాడు.
చివరి నిమిషంలో ఎన్నికల ప్రచార షెడ్యూల్ మార్చిన జగన్ చివరి సభను పిఠాపురంలో ప్లాన్ చేయటం కూటమి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సభలో జగన్ స్పీచ్ ఎలా ఉండబోతోంది, పవన్ ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, చివరి క్షణంలో జగన్ పర్యటన వంగా గీత గెలుపుపై ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుంది అన్నది ఆసక్తిగా మారింది.