మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం తెలిపింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఈ సందర్బంగా సంతాపం తెలిపిన సీఎం జగన్.. గౌతమ్ రెడ్డి లేని లోటు పూడ్చలేదన్నారు. గౌతమ్ రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీర్చని లోటని అన్నారు. గౌతమ్ రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమన్నారు. సంగం బ్యారేజీ పనులను ఆరు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ప్రకటించారు.
గౌతమ్ రెడ్డి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు ఎమ్మెల్యే రోజా. సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ప్రజల మెప్పు మాత్రమే కాదు... తోటి నేతల మెప్పు కూడా పొందిన వ్యక్తి గౌతమ్ అన్నారు. జగనన్నకు నిజమైన సైనికుడు గౌతమ్ రెడ్డి అని అన్నారు రోజా.
మరిన్ని వార్తల కోసం:
ఏడేండ్లల్ల ఏడు రెట్లు పెరిగిన అప్పులు
వ్యవసాయానికి గతేడాది కంటే రూ.746 కోట్లు తక్కువ