మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా చేపట్టలేదని ఎమ్మిగనూరు సిద్ధం సభలో సీఎం జగన్ అన్నారు. పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధనికులకు అందే చదువు.. పేద విద్యార్థులు కూడా అందిస్తున్నామన్నారు. విద్యారంగాన్ని విస్మరించిన చంద్రబాబుకు ఓటేస్తారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. మీ ఓటుతోనే మీ పిల్లల భవిష్యత్ మారుతుందన్నారు. విద్యారంగంలో వచ్చిన మార్పులకు సంతోష పడుతున్నానంటూ.. మే 13న కురుక్షేత్ర యుద్దం జరగబోతుందన్నారు. 58 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.
మా పథకాలు చూశారు.. ప్రభుత్వాన్ని చూసి రాఖీ కట్టండని సీఎం జగన్ అన్నారు. ఇళ్ల పట్టాలిచ్చిన వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలన్నారు. పేద మహిళల కష్టాల నుంచి సంక్షేమ పథకాలు వచ్చాయన్నారు. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఎమ్మిగనూరు సభలో అన్నారు.
Also Read: బీసీల తోకను కత్తిరిస్తామన్న బాబు తోకను కత్తిరించండి..ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్