జనంలోకి జగన్ - బస్సు యాత్ర షెడ్యూల్ రెడీ..

2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. షెడ్యూల్ విడుదల అనంతరం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల రేసులో అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, సిద్ధం సభలతో వరుస బహిరంగ సభలు నిర్వహించి దూకుడు ప్రదర్శించాడు. ఇప్పుడు ప్రచారం విషయంలో కూడా జగన్ అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్ర ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు జగన్. 

ఈ నెల 27న ప్రారంభం కానున్న జగన్ బస్సు యాత్ర ఇచ్ఛాపురం నుండి ఇడుపులపాయ వరకు సాగనుంది. ఈ యాత్ర జిల్లాల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర జరగనుంది.ఈ మేరకు రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఫిక్స్ చేశాడు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి పోలింగ్ తేదీకి 50రోజులకు పైగా గ్యాప్ ఉన్న నేపథ్యంలో జగన్ వీలైనన్ని ఎక్కువ రోజులు ప్రచారానికి కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ALSO READ :- చితి మధ్యలో.. చితా భస్మంతో హోలీ ఆడతారు... ఎక్కడంటే...