పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ కీలక సమావేశం

పార్టీ ఎమ్మెల్యేలతో  సీఎం జగన్‌ కీలక సమావేశం

సీఎం జగన్ కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నారు. ఉదయం 11గంటలకు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి  వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరుకానున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న  సమావేశం కావడంతో ఈ భేటీ ప్రాధన్యతను సంతరించుకుంది.

ఈ సమావేశంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన దగ్గర ఉన్న సమాచారం అధారంగా వారికి కర్తవ్య బోధన చేయనున్నారు. అలాగే జగనన్నే మన భవిష్యత్  క్యాంపెయిన్ పై పార్టీ నేతలకు  సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.