వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఇడుపులపాయలో మొదలైన ఈ ఎన్నికల ప్రచార యాత్ర ఇచ్ఛాపురంలో ముగియనుంది. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. రాయలసీమ జిల్లాల్లో అశేష జనాదరణ పొందిన బస్సు యాత్ర కోనసీమలో కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో కూటమి శ్రేణుల గుండెల్లో గుబులు మొదలైనట్లు కనిపిస్తోంది.
జగన్ బస్సు యాత్ర మొదలైన కొత్తలో జగన్ బస్సు యాత్రకు రాయలసీమ దాటితే రెస్పాన్స్ ఉండదని కామెంట్ చేసిన కూటమి నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. నిన్నటిదాకా కూటమి బలంగా ఉదని భావించిన వైజాగ్, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా జగన్ బస్సు యాత్రకు సూపర్ రెస్పాన్స్ రావటంతో కూటమిలో టెన్షన్ మొదలైందని టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం కోనసీమలో జగన్ యాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే వైసీపీ గ్రాఫ్ పెరిగిందని స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి, కోనసీమ ఓటర్ తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.