జగన్ బస్సు యాత్ర ఈరోజుతో సమాప్తం... హైలైట్స్ ఇవే..

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం కోసం సీఎం జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. మార్చి 27న ఇడుపులపాయ నుండి ప్రారంభమైన ఈ యాత్ర మధ్యలో రెండు, మూడురోజుల విరామం మినహా 22రోజుల పాటు నిరంతరాయంగా సాగింది. ఈ యాత్ర ద్వారా జగన్ 12ఉమ్మడి జిల్లాల్లో 15బహిరంగ సభలు నిర్వహించారు. బస్సు యాత్ర ఆద్యంతం జగన్ కు మహిళలు, విద్యార్థులు, కార్మికులు ఇతర వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఇలా వివిధ వర్గాలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు జగన్.

జగన్ బస్సు యాత్ర హైలైట్స్ ఇవే:

  • కడప, కర్నూలు జిల్లాల్లో జగన్ కోసం రైతులు 1000 ఎడ్ల బండ్లతో వచ్చి స్వాగతం పలకటం హైలైట్ గా నిలిచింది.
  • జనసేనకు చెందిన పలువురు ఇంచార్జిలు, కీలక నేతలు జగన్ సమక్షంలో పార్టీలో చేరటం మరో హైలైట్.
  • విశాఖ, విజయవాడలో విద్యార్థులు జగన్ మాస్కులు ధరించి సందడి చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇదిలా, ఈ యాత్రలో ఒకటి, రెండు అవాంఛిత ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కర్నూలులో జగన్ పర్యటిస్తుండగా ఒక ఆగంతకుడు జగన్ పైకి చెప్పు విసిరాడు. అయితే, బస్సుకు దూరంగా పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడలో జగన్ పై జరిగిన రాయి దాడి రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే, రాయి నుదిటి మీద తగిలటంతో జగన్ కు ప్రాణాపాయం తప్పింది. ఇలా ఒకటి అరా అవాంతరాలు మినహా జగన్ బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయ్యిందని వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..