ఆదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపి భయం పట్టుకుందని, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో బీజేపీని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ మాట్లాడుతూ... కేసీఆర్ వంటి నాయకుల వల్ల హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు నష్టం వాటిల్లనుందని, దేశంలోని హిందూ సమాజం మొత్తం ఒక్కటై ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పీకే తన సర్వేలో కేసీఆర్ ఓడిపోతుండని చెప్పాడని, అదే ఇప్పుడు టీఆర్ఎస్ ను నిద్రపోకుండా చేస్తోందన్నారు. టీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైందన్నారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల కంటే కేంద్రమే ఎక్కువ ఇచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను బానిసలుగా మార్చేసిందని, అందుకే పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం జోలికి వస్తే కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్రంలో రాబోయేది తమ ప్రభుత్వమేనని, వచ్చాక కేసీఆర్ పనిపడుతామని హెచ్చరించారు.
మరిన్ని వార్తల కోసం:
నా పోరాటం రాబోయే తరాల కోసమే..
ఆర్ఎస్ఎస్ నుంచే ఆప్ పుట్టింది