అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చెప్పిన హామీలను ఐదారు నెలల్లోనే ఆమలు చేస్తామన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి LIC ద్వారా 5 లక్షల కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. వచ్చే బడ్జెట్ లోనే దీనిని అమలు చేస్తామన్నారు. దీనివలన 93 లక్షల మందికి లబ్థి చేకూరనుందని తెలిపారు.
మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు
- రైతుబంధు 16 వేలకు పెంపు.. మొదటి సంవత్సరం రూ.12వేల నుంచి మెదలు
- దివ్యాంగుల పెన్షన్లు రూ.6వేలకు పెంపు.. (మార్చి తర్వాత రూ.5వేలు చేసి.. ప్రతి సంవత్సరం 300కి పెంచుతూ ఆరు వేలకు)
- ఆసరా పెన్షన్లు రూ.5వేలకు పెంపు (మార్చి తర్వాత పెన్షన్‌ను రూ.3వేలు చేసి. ప్రతి సంవత్సరం రూ. 500 పెంచుతూ ఐదో సంవత్సరం నిండేనాటికి రూ.5వేలకు)
- తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు సన్నబియ్యం
- రైతుబీమా తరహాలో ప్రజలందరికీ ఉచిత బీమా.. కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికీ ధీమా అనే పథకంతో ఎల్ఐసీ ద్వారా బీమా 93 లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం
- అర్హులైన పేద మహిళలకు 400కే గ్యాస్ సిలిండర్..అక్రిడేషన్ జర్నలిస్టులకు కూడా
- సౌభాగ్యలక్ష్మీ పథకం కింద పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి
- హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
- ఆరోగ్యశ్రీ రూ. 15 లక్షలకు పెంపు..
- జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీమ్
- అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి కొత్తగా 119గురుకులాలు ఏర్పాటు
- మహిళా స్వశక్తి గ్రూప్ లకు సొంత భవనాలు
- అసైన్డ్ లాండ్ లపై పూర్తి సర్వహక్కులు