కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ప్రభుత్వం గుడ్న్యూస్

కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ప్రభుత్వం గుడ్న్యూస్

హైదరాబాద్: రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 11,100 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో షెడ్యూల్ 9, 10 వివాదం కూడా పరిష్కారం ఏర్పడితే మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మొత్తానికి తెలంగాణలో 91,142 ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయని.. వాటిని భర్తీ చేస్తామని తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించి 80,039 జాబ్స్ భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటినుంచి ప్రతి ఏడాది ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించి, భర్తీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఇకపై కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు ఉండవని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

మాకు రాజకీయాలంటే పెద్ద టాస్క్

ఇక నుంచి 95 శాతం స్థానికులకే  ఉద్యోగాలు