జగిత్యాల జిల్లాలోని బండలింగాపూర్ ను మండలంగా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల పట్టణంలోని మోతెలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో సీఎం ఈ ప్రకటన చేశారు. జిల్లాలోనే అనేక వరద కాల్వలపై తుములు నిర్మించుకున్నామని, వరద కాల్వల మీద 13వేల మోటర్లు ఉన్నాయని సీఎం చెప్పారు. అటు వేములవాడలోని కథలాపూర్, భీమారంతో పాటు మరో మండలానికి సాగునీటిని సరఫరా చేస్తామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మద్దుట్ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కేసీఆర్, టీఆర్‌ఎస్‌కన్నా ముందు ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులను చూశారు. ఈ ప్రాంతం నుంచి మంత్రులను చూశారు. కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, బాల్కొండలో లక్షల సంఖ్యలో బీడీ కార్మికులున్నారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నా తెలంగాణలో రూ.2016 పెన్షన్ ఇస్తున్నాం. రేషన్‌కార్డులతో బియ్యం, పిల్లలకు ఉద్యోగం, ఆరోగ్యశ్రీ కింద వైద్యం, కల్యాణలక్ష్మి కింద వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం’ అన్నారు. ఇక కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు.