- డోలు వాయిద్య కళ అభివృద్ధికి రామచంద్రయ్య ఎనలేని కృషి చేశాడన్న కేసీఆర్
హైదరాబాద్ : పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు సీఎం కేసీఆర్ రూ. కోటి రివార్డు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రామచంద్రయ్యకు ఇటీవల పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామచంద్రయ్య సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్యను సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.కోటి రివార్డును ప్రకటించారు. అలాగే రామచంద్రయ్య సొంత జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఇంటి స్థలం కూడా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రామచంద్రయ్య డోలు వాయిద్య కళ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనకు దిగుతాం
బడ్జెట్తో ఎవరికీ లాభం లేదు: రేవంత్ రెడ్డి