పరకాల అభివృద్ధి బాధ్యత నాదే : కేసీఆర్‌‌‌‌

హనుమకొండ/పరకాల, వెలుగు : పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేసి పెట్టే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్‌‌‌‌ హామీ ఇచ్చారు. పరకాలలో కోర్టు అవసరం ఉందని ధర్మారెడ్డి అడుగుతున్నారని, హైకోర్టు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌తో మాట్లాడి కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. హనుమకొండ జిల్లా పరకాలలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌‌‌‌ మాట్లాడారు. గతంలో నీళ్లు, కరెంట్‌‌‌‌ లేక పరకాల ప్రజలు భీవండికి వలసపోయేవారని, ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌తో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్‌‌‌‌ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి పాల్గొన్నారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరికలు

ఆత్మకూరు, వెలుగు : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌‌‌‌ ఎంపీటీసీ, బ్లాక్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు బీరం రజినీకాంత్‌‌‌‌రెడ్డి శుక్రవారం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ఆయనకు పరకాల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ చల్లా ధర్మారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ విధి విధానాలు నచ్చే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.