కేసీఆర్ 8వ నిజాంలా వ్యవహరిస్తుండు

టీఆర్ఎస్ రజాకార్ల పార్టీ అన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాటలు కరక్టేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను 8వ నిజాం అవుతానన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో నిజాంను తరిమినట్లే కేసీఆర్ను పంపుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ పులి అయితే అడవికి వెళ్లాలని ఇక్కడే ఉంటే జూలో పెడతారని రాజాసింగ్ సటైర్ విసిరారు. సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. కావాలంటే సభకు వచ్చి చూడాలని అన్నారు.
మహబూబ్ నగర్ సభలో బండి సంజయ్ చేసిన ఆరోపణల్లో తప్పేమీ లేదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. చేతనైతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ బేవకూఫ్ అని, భూకబ్జా మంత్రి అని లోకల్ ప్రజలే చెప్తున్నారని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు నేడు మంత్రిగా ఉన్నారని విమర్శించారు. గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉర్దూలో ఎందుకు పెడుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. ఎంఐఎంను సంతోషపెట్టేందుకే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.