మర్యాదగా మనకు తెలంగాణ ఇవ్వలే.. గోస పెట్టి ఇచ్చిన్రు: సీఎం కేసీఆర్

తెలంగాణ ఇచ్చామని చెప్పుకునేందుకు కాంగ్రెస్ కు సిగ్గుండాలి.. మర్యాదగా మనకు తెలంగాణ ఇవ్వలే.. గోసపెట్టి తెలంగాణ ఇచ్చిన్రు.. ఎంతోమంది విద్యార్థుల త్యాగ ఫలితం.. మా పోరాటానికి దిగొచ్చి తెలంగాణ ఇచ్చిన్రు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి.. ఇవాళ తెలంగాణలో నీలి విప్లవాన్ని తీసుకోచ్చాం.. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు సీఎం కేసీఆర్. యూపీ, బీహార్, కర్ణాటక నుంచి వరినాట్లు వేసేందుకు తెలంగాణకు కూలీలు వస్తున్నారని చెప్పారు. 

తుంగతుర్తి సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. దళితులను ఇంకా దరిద్రం వెంటాడుతోంది. ఈ పరిస్థితి కారణం గత పాలకులే అన్నారు సీఎం కేసీఆర్. దళితుల గురించి ఏ ప్రభుత్వం ఏనాడైనా పట్టించుకోలేదన్నారు. దళితబంధుతో బీఆర్ ఎస్  ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. తుంగతుర్తి ప్రాంతాన్ని ఏ నాయకుడు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చాక.. తుంగతుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. తుంగతుర్తిలో గెలిస్తే.. నియెజకవర్గం మొత్తం దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ధరణితో రైతులంతా ప్రశాంతంగా ఉన్నారన్నారు సీఎం కేసీఆర్. రైతుల ప్రశాంతతను చెడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు సీఎం కేసీఆర్.