కామారెడ్డి, వెలుగు: దళితులను సీఎం కేసీఆర్మోసం చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదన్నారు. దళితుబంధు కూడా టీఆర్ఎస్కార్యకర్తలకే తప్పా.. మిగతా వారికి ఇవ్వడం లేదన్నారు. దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేలు జరిగిందన్నారు. సచివాలయానికి అంబేద్కర్‌పేరు పెట్టగానే సరిపోదని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి దళితుల అభ్యున్నతికి పాటు పడాలన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బతుకుడే కష్టమవుతోందన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన జూడో యాత్రకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకొలేక బీజేపీ అబద్దాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, టౌన్ ప్రెసిడెంట్ పండ్ల రాజు, లీడర్లు శివకృష్ణమూర్తి పాల్గొన్నారు.
కామారెడ్డికి తరలిన టీఆర్ఎస్ లీడర్లు
భిక్కనూరు,వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ సమక్షంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనేందుకు మండల కేంద్రంతో పాటు మండలంలోని అయా గ్రామల్లోని టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. వెళ్లిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మ, నాగభూషణం గౌడ్, పట్టణ సర్పంచ్ తునికి వేణు, అందె మహేందర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబల్ల మల్లేశం, పైతరి స్వామి, సర్పంచ్‌లు మాధుమోహన్రెడ్డి, నాగర్తి పోతిరెడ్డి, ఎంపీటీసీలు దాయరి సాయిరెడ్డి, మంజుల సంవరెడ్డి ఉన్నారు.
వీసీ అవినీతిపై లేఖ రాయండి
నిజామాబాద్ టౌన్, వెలుగు: టీయూలో వీసీ రవీందర్‌గుప్తా చేస్తున్న అవినీతి, గర్ల్స్ హాస్టల్ ఘటనపై పాలక మండలి సభ్యులు ప్రభుత్వానికి లేఖ రాయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పాలక మండలి సభ్యుడు డాక్టర్ మారయ్యకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు నిఖిల్, సునీల్, మనోజ్ పాల్గొన్నారు.
లారీ ఢీకొని వృద్ధురాలు మృతి
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నగరంలోని అర్సపల్లిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో ఓ వృద్ధురాలు చనిపోయారు. 6వ టౌన్ఎస్సై సాయికుమార్వివరాల ప్రకారం.. అర్సపల్లిలోని తన ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న హైబత్ పోసాని(70) ని గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో స్పాట్లోనే చనిపోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఢీకొట్టిన లారీని గుర్తించామని చెప్పారు.
నేడు బ్లడ్ డోనేషన్ క్యాంప్
బాల్కొండ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా శనివారం బాల్కొండ మండల కేంద్రంలోని పాండురంగ ఫంక్షన్ హాల్‌లో ఉదయం11 గంటలకు బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు బీజేపీ మండల ప్రెసిడెంట్ అంబటి నవీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని క్యాంప్‌ను సక్సెస్ చేయాలని కోరారు.
గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఆర్మూర్, వెలుగు: టీఎస్ పీఎస్సీ గ్రూప్ 3, 4 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి నరేంద్ర డిగ్రీ కాలేజీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డి.రజిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులకు హాజరయ్యే అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు నిపుణులతో ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. మిగిలి ఉన్న సీట్లలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు చెందిన బీసీ అభ్యర్థులు తమ స్టడీ, క్యాస్ట్, ఆధార్, ఇన్‌కం సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో కాలేజీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
నందిపేట, వెలుగు: బీజేపీ అధికార ప్రతినిది ప్రకాశ్‌రెడ్డి చాకలి ఐలమ్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ ఐలమ్మ రజాకార్లను ఎదురించి సాయుధ పోరాటం చేసిన వీర వనిత అని, చరిత్ర మరిచి ఆమె గురించి తప్పుగా మాట్లాడిన ప్రకాశ్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు గవాస్కర్, సాగర్, సంతోష్, రాములు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఓ అబద్ధాల కోరు
నిజామాబాద్, వెలుగు: బంగారు తెలంగాణ అంటూ ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఓ పెద్ద అబద్ధాల కోరు అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విమోచనోత్సవాల్లో చరిత్రను వక్రీకరించేందుకు టీఆర్ఎస్ సర్కార్ కుట్రలు చేస్తోందన్నారు. జిల్లా కేంద్రంలోని దాశరథి జైలును శుక్రవారం బీజేపీ నేతలు బస్వా లక్ష్మీనర్సయ్య, యెండెల లక్ష్మీనారాయణ, పల్లెగంగారెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, మల్లికార్జున్‌రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 17 సమైక్యతా దినోత్సవం కాదని తెలంగాణ విమోచన దినోత్సవమన్నారు. కేసీఆర్ రాజకీయాల కోసం సమైక్యతా ఉత్సవాలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టి బలవంతంగా ఉత్సవాలు చేయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఆరాచకాలు ఎక్కువయ్యాయని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీకి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో బీజేపీ లీడర్లు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, న్యాలం రాజు, ప్రవళిక, స్రవంతిరెడ్డి, కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అరుణతార పాల్గొన్నారు.
లారీ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి
నవీపేట్, వెలుగు: మండలంలోని ఆ బంగపట్నం విలేజ్ వద్ద గుర్తుతెలియని లారీ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి చెందినట్లు ఎస్సై రాజిరెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దర్యపూర్‌కు చెందిన ఈర్నాల శ్రీనివాస్ (45) నవీపేట్ మార్కెట్ చెక్ పోస్ట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం11 గంటల ప్రాంతంలో బాసర వైపు నుంచి నిజామాబాద్ వెళ్తున్న లారీని తనిఖీ కోసం అపగా డ్రైవర్ ఆపకుండా స్పీడ్‌గా వెళ్లారు. ఇది గమనించిన శ్రీనివాస్ బైక్‌పై లారీని వెంబడించగా ఆ బంగపట్నం వద్ద ఆ డ్రైవర్ ఢీకొట్టి వెళ్లిపోయాడు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతిడి భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజిరెడ్డి తెలిపారు.
ఉత్తమ టీచర్లు, ఇంజినీర్లకు సన్మానం
బోధన్, వెలుగు: సమాజంలో అత్యున్నత స్థాయిలో స్థానం సంపాదించిన పది మంది గురువులు, ఇంజినీర్లకు బోధన్‌లోని విజయసాయి స్కూల్‌లో శుక్రవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి లక్ష్మి ఉత్తమ సేవలు అందించిన వారిని ప్రోత్సహించడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శాంతకుమారి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఇల్లేపు శంకర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు బసవేశ్వరరావు, శ్రీనివాసరావు, రామ్మోహన్‌రావు, చక్రవర్తి, లక్ష్మీకాంతరెడ్డి, గోపాల్‌రావు, ముత్తయ్య, సుబ్బారావు, రవికుమార్, సూర్యనారాయణ పాల్గొన్నారు.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
కామారెడ్డి, వెలుగు: అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని బీఎల్టీయూ స్టేట్లీడర్ సిద్ధిరాములు అన్నారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయాలన్నారు. శుక్రవారం కామారెడ్డిలోని బీఎల్టీయూ ఆఫీస్‌లో 10 శాతం రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ఇవ్వడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అంబేడ్కర్ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మల్లయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శివరాములు, లీడర్లు సదానందం, స్వామి తదితరులు పాల్గొన్నారు.
54వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె
భిక్కనూరు, వెలుగు: వీఆర్ఏలు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 54వ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పెస్కేల్, 55 ఏళ్లు నిండిన వారికి పింఛన్, వారి వారసులకు ఉద్యోగ భద్రత, అర్హులైన వారికి ప్రమోషన్లు వంటి హామీలను తక్షణమే నేరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తు అందోళన చేస్తామని హెచ్చరించారు.
అభివృద్ధి అబద్ధమైతే రాజీనామా చేస్తా
నిజామాబాద్, వెలుగు: అభివృద్ధిపై తాను మాట్లాడింది అబద్ధాలైతే తన పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతి పక్షాలు కుట్ర పూరితంగా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాల్కొండ లో ర్యాలీ నిర్వహించారు. హాజరైన మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 50 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. ఎనిమిదేండ్ల టీఆర్‌ఎస్‌పాలనలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్పాలనా తీరుపై ప్రజలు, రైతులు ఆలోచన చేయాలని, రెచ్చగొట్టే వారి మాటలు నమ్మితే గోస పడతామని హెచ్చరించారు. తెలంగాణ పథకాలను విమర్శిస్తున్న బీజేపీ, కాంగ్రెస్లీడర్లు వారి పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ‘కేసీఆర్ కిట్’ లాంటి స్కీం ఎందుకు ప్రవేశపెడ్తలేరో చెప్పాలన్నారు. తెలంగాణలో మత ఘర్షణలు పెట్టేందుకు చూస్తున్న బీజేపీ నియోజకవర్గంలో ఎన్ని రాముడి ఆలయాలు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, సీపీ నాగరాజు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పథకాల అమలులో మనమే నంబర్ వన్
తాడ్వాయి, వెలుగు: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ చెప్పారు. శుక్రవారం మండలంలోని ఎన్నికల గ్రామంలో ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరాస పెన్షన్లు, ఇంటింటికీ నల్ల, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు లాంటి పథకాలు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కతుందన్నారు. కొందరు ఓర్వ లేక పనిగట్టుకునిపై తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం అమూల్ సోలార్ ప్లాంట్ వారి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు ఉచితంగా పెన్నులు, బ్యాగులు, బెంచీలు తదితర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎంపీపీ కౌడి రవి, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీఎంఐ డైరెక్టర్ కపిల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్గం సాయిరెడ్డి, సీడీసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెల్మ రవి, జడ్పీటీసీ బత్తుల రమాదేవి, సర్పంచ్ పౌరాజు పాల్గొన్నారు.
వెల్లివిరిసన సమైక్యత..
నియోజకవర్గ కేంద్రాల్లో అట్టహాసంగా ర్యాలీలు
సెప్టెంబర్ 17ను పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, డ్వాక్రా సంఘాల మహిళలు, స్టూడెంట్లు, వివిధ పార్టీల లీడర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సమైక్యతను చాటారు.
– వెలుగు, నెట్‌వర్క్