“యూపీఏ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన. నేను కేంద్ర కేబినెట్ లో ఉన్నప్పుడు 11 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినయ్. వ్యూహాత్మక దాడులంటారు వాటిని. అవి సరిహద్దులో జరుగుతూనే ఉంటాయి. దాన్నివాళ రాజకీయం చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ మీద మోడీ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కొట్టుకొడితే 300 మంది చనిపోయారని డొల్ల ప్రచారం చేస్తున్నారు. అజార్ మసూద్ అనేటోడు చెప్పిండు.. చీమ.. చీమ కూడా చావలేదని. నీతోనేం కాలేదని వాళ్లు అంటున్నరు. వీళ్లు చెప్పేదేమో ఇట్లున్నది. బీజేపీ నేతలు చేసేదంతా డంబాచారం.. ఇదేనా పరిపాలన చేసే తీరు. ఆ ఫొటోలు, వీడియోలు చూపించి ఓట్లు అడుగుతారా. దేశంలో పేదరికం సంగతేంది.. ఇతర సమస్యల సంగతేంది.. రైతుల గిట్టుబాటు ధరల సంగతేంది…. ఆర్థిక పరిస్థితి ఎట్ల పెంచాలె.. అనే విషయాలు ఆలోచించాచె” అని కేసీఆర్ చెప్పారు.
మిర్యాలగూడలో నిర్వహించిన నల్గొండ లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి స్థాయి నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
“పొద్దున లేస్తే ఫేస్ బుక్ , సోషల్ మీడియాలో దేవుళ్లు, దేవాలయాలు, హిందూ సంస్కృతి అనే మాట్లాడుతున్నారు. ఏం మనం కాదా హిందువులం. మనం మంచి హిందువులం. వాళ్లు సూడో హిందువులు. దొంగ హిందువులు ఓట్ల కోసం ఇతర మతాలను దెబ్బకొట్టే హిందూత్వం ప్రచారం చేస్తున్నారు. యూత్ ఆ మాయలో పడొద్దు” అన్నారు కేసీఆర్.