బీఆర్ఎస్ నేత ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీశ్ చురుకైన పాత్రను పోషించారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ ఛైర్మన్ జగదీష్ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. జగదీష్ మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. జగదీష్ కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. జగదీశ్ కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జగదీష్ పార్థివదేహానికి నివాళులర్పించారు మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్,MLC కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా జగదీష్ భార్య, పిల్లలను ఒదార్చి,ధైర్యం చెప్పారు. జగదీష్ అంతక్రియలు 2023 జూన్ 12 సోమవారం రోజున జరగనున్నాయి. అంత్యక్రియలలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని సమాచారం.
2023 జూన్ 11 ఆదివారం ఉదయం జగదీష్ గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. గతంలో కూడా జగదీష్ కు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.