టేబుల్ టెన్నిస్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో క్రీడారంగంలో శ్రీజ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఆకుల శ్రీజతో పాటుగా నిఖత్ జరీన్ కు కూడా అర్జున పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
టీటీ లెజెండ్ ఆచంట శరత్ కమల్ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ 2022కి గాను స్పోర్ట్స్ అవార్డు విన్నర్ల లిస్ట్‌ను సోమవారం ప్రకటించింది. మొత్తం 25 మంది అథ్లెట్లు అర్జునకు ఎంపికయ్యారు. ఈ నెల 30న రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల్ని అందజేయనున్నారు.