
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా జరుపుకునే ‘రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీవితాంతం తమకు అండగా వుండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భంగా సిఎం కేసీఆర్ తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సోదర, సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు.