
- మళ్లీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందని ధీమా
అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌ని ప్రజలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి.. బొందవెట్టాలని సీఎం కేసీఆర్అన్నారు. అసెంబ్లీలో రాష్ట్రాభివృద్ధిపై జరిగిన దీర్ఘకాలిక చర్చపై సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. ధరణి వల్ల కబ్జా దారులు, పైరవీకారులు పోయారని.. రైతు వేలు ముద్ర లేనిదే భూ బదిలీ సాధ్యం కాదని అన్నారు.
కాంగ్రెస్ధరణిని రద్దు చేస్తామని చెప్పడాన్ని ఆయన ఖండించారు. సంక్షేమంలో, అభివృద్ధిలో మొదటి స్థానంలో రాష్ట్రాన్ని నిలిపినందుకు తనకు పిండం పెడతారా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ని ప్రశ్నించారు. తాము చేసిన మంచేంటో.. కాంగ్రెస్ చేసిందేంటో ప్రజలకు తెలుసని.. పిండం ఎవరికి పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నీటి తీరువా కట్టాలని రైతుల మెడపై కత్తిపెట్టి వేధించిందని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీటి తీరువాను రద్దు చేసినట్లు వెల్లడించారు.
కాళేశ్వరమే లేకపోతే నీళ్లేక్కడివి..
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆ ప్రాజెక్టు లేకపోతే కొండనాయక్సాగర్ తదితర ప్రాజెక్టులకి నీరు ఎలా వచ్చేవని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే నీరు రావు.. కరెంటు రాదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలా తమకు నీతులు చెప్పేది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే కష్టాల చరిత్ర అని విమర్శించారు.