ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి కేకలే: కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి కేకలే: కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి కేకలేనని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ నేతలే ఆగం చేశారని తెలిపారు. గతంలో RDS కెనాల్ నుంచి నీళ్లు తరలించుకుని వెళ్తున్నా ఎవరూ మాట్లాడలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు పదవులపై ఆశతో ఏం మాట్లాడలేదన్నారు.

బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్‌ పార్టీనేని కేసీఆర్ చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటిస్తామన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కాంగ్రెస్‌ గతంలో పెండింగ్‌లో పెట్టిందని వివరించారు.  

గతంలో పాలమూరు నుంచి వలసలు ఉండేవని.. ఇప్పుడు అలా లేవని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్కొక్కటిగా అన్నీ బాగు చేసుకుంటున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ వేస్ట్ అంటున్నాడు.. మరి 3గంటల కరెంట్ తో ఎన్ని పంటలు పండుతాయని ప్రశ్నించారు. రైతులకు 10HP మోటారు ఎవరు కొనిస్తారని నిలదీశారు. 

తెలంగాణ బాగుండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపించాలని కేసీఆర్ కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.