దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారం!

ఈ నెల చివరన ఉండే అవకాశం

హైదరాబాద్, వెలుగు: ఇంతకాలం ప్రగతిభవన్ నుంచి దుబ్బాక బై ఎలక్షన్​ వ్యూహాలను రచించిన సీఎం కేసీఆర్.. ఇక నేరుగా ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 30 లేదా 31 తేదీల్లో దుబ్బాకలో ఆయన బహిరంగ సభ నిర్వహించే చాన్స్ ఉందని టీఆర్​ఎస్​ లీడర్లు చెప్తున్నారు. గతంలో పార్టీ కి గట్టి సపోర్టుగా ఉన్న యూత్ ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నట్టు పార్టీ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ వ్యతిరేక ప్రచారం జరుగుతోందని కలవరపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ కేడర్​లో జోష్​ నింపేందుకు సీఎం కేసీఆర్​ ఎన్నికల ప్రచారం చివరి దశలో బహిరంగ సభ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు లీడర్లు చెబుతున్నారు.

For More News..

గోదావరి ట్రిబ్యునల్‌‌కు కేసీఆర్‌‌ ఓకే

ఉల్లిగడ్డ మస్తు తింటున్నం.. ఒకప్పుడు ఏటా 2 కేజీలు తింటే.. ఇప్పుడు 14 కేజీలు

మక్కలు మళ్లీ కొనేది లేదు.. ఇదే చివరిసారి..