
బీఆర్ఎస్, ఎంఐఎం ఏళ్లుగా మంచి దోస్తులని సీఎం కేసీఆర్అన్నారు. అసెంబ్లీలో రాష్ట్రాభివృద్ధిపై జరిగిన దీర్ఘకాలిక చర్చపై సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. తమది సెక్యులర్పార్టీ అని చెబుతూ.. అదే అంశాన్ని నేరుగా ప్రజల ముందే ఉంచి ఇప్పటివరకు ఓట్లు అడిగామని ఇక ముందు బీఆర్ఎస్ అదే విధానం అనుసరిస్తుందని తెలిపారు.
ఓట్ల కోసం మతకుంపట్లు రగిలించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే రకం తాము కాదని చెప్పారు. రానున్న రోజుల్లో సైతం బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తుందని స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని.. కుల మతాలు చూడట్లేదని తెలిపారు. ఇప్పటికే బ్రాహ్మణుల సంక్షేమానికి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని.. వారి జీత భత్యాలు ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.