బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ వేశారు. ఈసారి గజ్వేల్ తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి గజ్వేల్ వెళ్లిన కేసీఆర్ నామినేషన్ వేశారు. గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను కేసీఆర్ సమర్పించారు.
అనంతరం అక్కడి నుంచి కామారెడ్డికి చేరుకున్న కేసీఆర్.. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో, మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో నామినేషన్ వేశారు.