గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మొదలుకొని.. గల్లీ వరకు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. తెలంగాణలో కూడా రిపబ్లిక్ డేను కరోనా నిబంధనల మధ్య జరుపుకుంటున్నారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, సీఎంఓ అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
అంతకుముందు సీఎం కేసీఆర్.. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పరేడ్ గ్రౌండ్ లో అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.#గణతంత్రదినోత్సవం#RepublicDayIndia pic.twitter.com/MoRcfrULhd
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2022
For More News..