భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : దొరల పాలన పోతేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన కొత్తగూడెంలో పర్యటించారు. మీడియాతో మాట్లాడుతూ.. రూ. లక్ష లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని విమర్శించారు.
లక్షల కోట్లు అప్పులు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 300 మంది మృతికి కారణమైన రైలు ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తన పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు.