
- ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, వెలుగు : పరకాల నియోజకవర్గం అభివృద్ధికి రూ.216.05కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 36 రోడ్లకు రూ.146కోట్ల 40లక్షలు మంజూరయ్యాయని, వీటితో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల రిపేరుతోపాటు కొత్త రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు.
రూ.130కోట్ల 5లక్షలతో ఆరు చెక్‌డ్యాంలు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారమిస్తే దళారీ రాజ్యం వస్తుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.