ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొడుకు పెళ్లికి సీఎం కేసీఆర్

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొడుకు పెళ్లి ఆదివారం జరుగనుంది. వివాహ వేడుకకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. వివిధ జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ బందోబస్తు ఏర్పాట్ల గురించి దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాలు, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను గమనిస్తూ ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు.

పర్యటన సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  బందోబస్తును ఏర్పాటు జరిగిందని వి.సత్యనారాయణ తెలిపారు. ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు ఇతర సిబ్బంది సహా మొత్తం 1110 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ వెల్లడించారు.