ఇందల్వాయి టోల్​ ప్లాజా వద్ద టీ తాగిన కేసీఆర్​

ఇందల్వాయి టోల్​ ప్లాజా వద్ద టీ తాగిన కేసీఆర్​

ఇందల్వాయి, వెలుగు: కామారెడ్డి లో రోడ్​ షోకు వెళ్లేందుకు బయలుదేరిన బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ మార్గమధ్యలో ఇందల్వాయి టోల్​ప్లాజా వద్ద ఆగారు.  స్థానిక హోటల్‌‌ లో టీ తాగి, పకోడి తిన్నారు. 

 అభిమానంతో మాట్లాడిన వారికి సరదాగా కేసీఆర్ సమాధానాలు ఇవ్వడంతో నవ్వులు విరిశాయి.  దగ్గరకు వచ్చిన వారికి తన పకోడి ప్లేట్‌‌ని అందించారు. చిన్న పిల్లలకు పకోడి తినిపించారు. ఆయన వెంట నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్​, రాజ్యసభ ఎంపీ సురేశ్ రెడ్డి,​ మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్​ తదితరులు ఉన్నారు.