హైదరాబాద్, వెలుగు: ఇప్పటివరకు మొత్తం 103 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫాంలు అందజేశారు. బుధవారం గంగుల కమలాకర్ (కరీంనగర్), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్), చల్మెడ లక్ష్మీనర్సింహారావు (వేములవాడ), బండారి లక్ష్మారెడ్డి (ఉప్పల్), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజిగిరి)కి బీఫాంలు అందించారు. మంగళవారం సుంకె రవిశంకర్(చొప్పదండి)కు బీఫాం ఇచ్చారు.
ఈ నెల 15న 69 మందికి, ఆ మరుసటి రోజు 28 మందికి కేసీఆర్బీఫాంలు ఇచ్చారు. ఇంకో 16 మందికి బీఫాంలు అందజేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించని నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలు కూడా ఉన్నాయి. వారికి గురు, శుక్రవారాల్లో బీఫాంలు ఇచ్చే అవకాశముందని బీఆర్ఎస్నేతలు చెప్తున్నారు.