నూతన సచివాలయ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ తన ఛాంబర్లో ఆరు ఫైళ్లలో సంతకాలు చేశారు. అందులో మొట్టమొదటి సంతకాన్ని "కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ" ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం వివిధ పథకాల అమలుకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు.
వేద పండితుల ఆశీర్వచనం
అనంతరం సమయంలో సీఎం కేసీఆర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అంతకు ముందు ఎలక్ట్రిక్ వాహనంలో పలు ఛాంబర్లను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, తదితరులు సీఎంని అభినందించారు.