అభివృద్ధిం చేశాం.. ఆదరించండి: విఠల్​రెడ్డి

అభివృద్ధిం చేశాం.. ఆదరించండి: విఠల్​రెడ్డి

భైంసా, వెలుగు: సీఎం కేసీఆర్​ నాయకత్వంలోని బీఆర్ఎస్​ ప్రభుత్వం ముథోల్​ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిందని.. మరింతగా అభివృద్ధి చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే విఠల్​రెడ్డి ప్రజలను కోరారు. కోట్ల రూపాయలతో రోడ్లు, మురికి కాలువలు నిర్మించామని.. ఎన్నో ప్రగతి పనులు చేపట్టామని చెప్పారు. మంగళవారం భైంసాలోని పార్టీ ఆఫీస్​లో సీఎం కేసీఆర్​ ప్రజా ఆశీర్వాద సభపై మీటింగ్​ నిర్వహించారు.

ఈ నెల 3న సీఎం కేసీఆర్​ వస్తుండడంతో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. సభకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పట్టణంలోని పలు కాలనీల నుంచి కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్​లో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్​ చైర్మన్​ జేకే పాటిల్​, డైరెక్టర్​ తోట రాము, లీడర్లు పిప్పెర కృష్ణ, సయ్యద్​ ఆసీఫ్​, మురళీగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.