కేటీఆర్, హరీష్ రావులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం

నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హాట్రిక్ కొట్టాలని బిఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే  అన్ని పార్టీల కంటే ముందుగానే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్.. ప్రచారంలోనూ దూసుకెళ్లాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం(2023 అక్టోబర్ 12)  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో  అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సదర్భంగా ఎన్నికల ప్రచారం, పెండింగ్ స్థానాలు, మేనిఫెస్టో వంటి అంశాలపై  మంత్రులతో సిఎం కెసిఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం.

Also Read :- జగిత్యాలలో దళిత బంధు రగడ పంచాయతీల ముట్టడి

ఇక, అక్టోబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు  సిఎం కెసిఆర్ సిద్ధమయ్యారు.  పెండింగ్ లో ఉన్న జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్, మల్కాజిగిరి  స్థానాలకు సీఎం కేసీఆర్  అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.