![ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు](https://static.v6velugu.com/uploads/2022/04/CM-KCR-Iftar-dinner-for-Muslim-brothers_GVD9hbIjCY.jpg)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈనెల 29న సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. లౌకిక వాదాన్ని కాపాడడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇఫ్తార్ విందులో ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పాల్గొననున్నారు.
మరిన్ని వార్తల కోసం..
దేవాదుల స్కీమ్ అంచనా వ్యయం పెంపునకు రెడీ!
వచ్చే వారం పుతిన్, జెలెన్స్కీతో గుటెరస్ భేటీ