జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్... రూ. 49 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని సీట్లో కలెక్టర్‌ జీ రవిని కూర్చోబెట్టి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు సీఎం జగిత్యాలలో నూతనంగా నిర్మించిన జిల్లా పార్టీ కార్యాలయాన్ని  ప్రారంభించారు.  రూ.510 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వైద్య కళాశాల  భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.  మరికాసేపట్లో సీఎం మోతెలో ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో పాల్గొంటారు.