
మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మాలోత్ కవిత, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పలువురు నేతలు పాల్గొన్నారు. కాసేపట్లో కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. కలెక్టరేట్ ప్రారంభించాక ఆఫీసర్లతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 1.25 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం వెళ్తారు.
కేసీఆర్ టూర్ సందర్భంగా మానుకోట పట్టణాన్ని ముస్తాబు చేశారు. రోడ్ల వెంట మొక్కలు నాటి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. డివైడర్లు, గోడలకు రంగులు వేశారు. ఆఫీసర్లు రేయింబవళ్లు శ్రమించి పనులు చేయించారు. అదనపు సిబ్బందిని కేటాయించి వీధుల్ని శుభ్రం చేయించారు. పోలీసులు 1600 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.