ప్రతిమ గ్రూప్ సేవలు ఇంకా విస్తరించాలి

వరంగల్లో పర్యటిస్తున్న  ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలను  ప్రారంభించారు.   ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, గంగుల, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి,మధుసూధనా చారి  తదితరులు పాల్లొన్నారు. మెడికల్ ఆసుపత్రిలో 330 బెడ్స్, క్యాన్సర్‌ ఇన్‌‌స్టి‌ట్యూ‌ట్‌ లో  మరో 300  బెడ్స్ ఉన్నాయని ప్రతిమ చెర్మెన్ శ్రీనివాసరావు వెల్లడించారు. వైద్య, విద్యకు సీఎం ప్రోత్సహిస్తున్నారని అన్నారు. 

ప్రతిమ గ్రూప్ సేవలు ఇంకా విస్తరించాలి 

ప్రారం‌భో‌త్సవం  అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ..  ప్రతిమ సేవలు ఇంకా విస్తరించాలన్నారు.  తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ వన్ గా ఉందన్న సీఎం... వైద్య విద్య కోసం విద్యార్దులు చైనా, ఉక్రెయిన్ కు వెళ్లాళ్సిన అవసరం లేదన్నారు.  సరిపడ సీట్లు రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు.  రాష్ట్రం పై కేంద్రం వివక్ష చూపుతోందన్న కేసీఆర్.. . ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు 33 జిల్లాలలో కళాశాలలను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు.

రాష్ట్రంలో 6,500 మెడికల్  సీట్లుండగా,అన్నీ పూర్తియితే 10 వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. రాజకీయల కోసం కేంద్రమంత్రలు రాష్ట్రానికి వచ్చి తిట్టిపోయిన మర్నాడే అవార్డులు వస్తున్నాయన్నారు. తమ లాంటి వారికి వయసు అయిపోతుందని, కానీ యువతకు మంచి భవిష్యత్తు  ఉందని అన్నారు. దేశం మీదని అద్భుతాలు సృష్టించాలని విద్యార్ధులకు సీఎం సూచించారు.