రాష్ట్రంలో దేవాలయాల అభివృద్దికి సీఎం కేసీఅర్ కట్టుబడి ఉన్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఆయన మే 03 బుధవారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం భూ సేకరణ చేసి రూ.100 కోట్ల నిధులను మంజూరు చేశామని తెలిపారు.
రాజన్న ఆశీస్సుల తోనే సీఎం కేసిఆర్ పరిపాలన బాగుంటుందన్నారు. రాజన్న ఆలయం అంటే సామాన్యుల దేవుడని తెలిపారు. సీఎం కేసీఅర్ నూతన సచివాలయాన్ని పూర్తి చేసి మొట్టమొదటిగా సంక్షేమ ఫైళ్లపై సంతకం చేశారని మంత్రి తెలిపారు. రాష్ట్రం లో అన్ని దేవాలయాలకి ధర్మకర్తల మండలి వేసామన్న మంత్రి.. కేవలం కొన్ని టెంపుల్ మాత్రమే ధర్మకర్తల మండలి వేయలేదని దీనిపై సీఎం కేసీఅర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడికి పోయిన చెరువులు, వాగులు, నదులు పొంగిపోర్లుతున్నాయని ఇంద్రకరణ్ తెలిపారు. దేశంలోనే 56 లక్షల వరి ధాన్యం తెలంగాణ రాష్ట్రంలో పండుతుందని వెల్లడించారు.