వీణవంక, వెలుగు: రైతుల సంక్షేమమే బీఆర్ఎస్ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు తయారు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం వీణవంక మండల కేంద్రంలో ప్యాక్స్కొత్త భవనానికి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రైతు పక్షపాతి అని, ప్రతి మండలంలో సొసైటీలకు భవనాలు ఏర్పాటు చేశారన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్.. దేశానికి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేణుక, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.