బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ బలుపెక్కి మాట్లాడుతున్నాడని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటూ బరితెగించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. బన్సీలాల్ పేట్ లో బీజేపీ చేపట్టిన నిరసన దీక్ష ను భగ్నం పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ కొంత సమయం పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కు బీజీపీ అంటే భయం పట్టుకుందని, అందుకే బీజేపి దీక్షలను భగ్నం చేస్తున్నారన్నారు. బీజేపి కార్యకర్తలపై దాడులు చేయిస్తూ రాక్షసానందం పొందతున్న కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజుల్లో దగ్గరపడ్డాయన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు.
మరిన్ని వార్తల కోసం: