
సింగూరు ప్రాజెక్టుపై నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ ఇవాళ( సోమవారం) శంకుస్థాపన చేశారు.హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్ చేరుకున్న సీఎం.. ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 3.84 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో 57వేల ఎకరాలు, జహీరాబాద్‌లో 1.06 లక్షల ఎకరాలు, అంధోల్‌లో 56వేల ఎకరాలు, నారాయణఖేడ్ పరిధిలో 1.65 లక్షల ఎకరాలకు రెండు లిఫ్టుల ద్వారా సాగు నీరు అందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని సింగూరుకు తరలించి అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా 4 నియోజకవర్గాలకు నీరందించే ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.4,427కోట్లు ఖర్చు చేయనుంది.
మరిన్ని వార్తల కోసం...