ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు లంచ్ మీటింగ్ కోసం కేసీఆర్ ఆయన నివాసానికి వెళ్లారు. సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికిన కేజ్రీవాల్ ఆయనను శాలువాతో సత్కరించారు. భేటీ సందర్భంగా ఇరువురు నేతలుసమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర కేంద్ర ప్రభుత్వం విధానాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం అనంతరం ఇద్దరు సీఎంలు చండీఘడ్ వెళ్లనున్నారు. కేసీఆర్ తో వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Delhi | Telangana CM K Chandrashekar Rao meets CM Arvind Kejriwal at his residence pic.twitter.com/swQbe7lxit
— ANI (@ANI) May 22, 2022
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. 600 కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున చెక్కులు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొననున్నారు.
For more news..