
హైదరాబాద్ :రాష్ట్ర సర్కారు కొత్తగా తీసుకొస్తున్న చట్టాలను వివరించేందుకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. మున్సి పాలిటీల్లో పాతుకు పోయిన అవినీతిని అరికట్టి, ఉద్యోగుల్లో బాధ్యతను పెంచడానికి కొత్త మున్సి పల్ యాక్ట్ తీసుకొస్తున్నట్లు గవర్నర్ కు కేసీఆర్ వివరించారు. అర్బన్ ఏరియాల్లో భూయాజమాన్య హక్కులు, ఇళ్ల పర్మిషన్లు, ఆస్తి పన్ను వసూళ్లు, ఇతర లావాదేవీలు పారదర్శకంగా సాగేలా కొత్త చట్టం ఉండబోతుందని చెప్పారు. ఉత్తమ పౌర సేవలు అందించేలా చట్టాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు. ఈ చట్టం పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ ను చేర్చడం లేదని చెప్పి నట్లు సమాచారం. జీహెచ్ ఎంసీకి, హెచ్ ఎండీఏకు ప్రత్యేక చట్టాలు ఉన్న కారణంగా వాటిని అలాగే కొనసాగించి అవసరమైనంత వరకే స్వల్ప మార్పులు చేస్తామని చెప్పినట్లు సమాచారం.
రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు గవర్నర్ కు చెప్పారు. ప్రభుత్వం ఎంత కష్టపడి పనిచేసినా, ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా కొంత మంది ఉద్యోగుల కారణంగా అనుకున్న స్థాయిలో అమలు కావడంలేదని అందుకే కొత్త చట్టం తీసుకువస్తున్నామని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థలో లంచాలకు తావులేకుండా కొత్త చట్టం ఉండబోతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యు టేషన్లు తదితర వ్యవహారాలన్నీ ఇకపై కొత్త చట్టం ద్వారా తేలిగ్గా జరిగిపోతాయని వివరించారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. గ్రూప్-1 , గ్రూప్ -2 సహా, స్టేట్ క్యాడర్‌లో ని ఉద్యోగాలన్నీ దీని కిందికి తీసుకువస్తామని చెప్పారు.
కొత్త చట్టాల అమలు కోసం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత ముందు ఆర్డినెన్స్ తీసుకువచ్చి, ఆ తర్వాత శాసనసభ, మండలి ఆమోదం పొందుతామని చెప్పినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ తీరు, ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్ని కలపైనా కూడా ఇద్దరు చర్చించినట్టు తెలిసింది. ఏపీలో రాజకీయ పరిస్థితులు, పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింస, పోలింగ్ రాత్రి వరకు కొనసాగడం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. పోలింగ్ తర్వాత నెలకొన్న పరిస్థితు లపై గవర్నర్ ఆరా తీసినట్లు సమాచారం. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఎందుకు తొలగిం చాల్సి వచ్చిం దని గవర్నర్ వివరణ కోరినట్లుగా తెలిసింది. అంబేద్కర్ జయంతికి ముందు గ్రేటర్ అధికారుల అనాలోచిత చర్యతో ప్రజల్లో ఉద్వేగా లు రెచ్చగొట్టారని గవర్నర్ పేర్కొన్నట్టుగా సమాచారం. విగ్రహ తొలగింపు వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా తెలిసింది.