కొండగట్టులో ముడుపు చెల్లించిన కేసీఆర్

కొండగట్టు అంజన్నకు కట్టిన ముడుపును సీఎం కేసీఆర్ చెల్లించారు. ఉద్యమ సమయంలో చేపట్టిన దీక్ష సందర్భంలో సిఎం కేసీఆర్  క్షేమాన్ని కాంక్షిస్తూ  రాష్ట్ర ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కట్టిన ముడుపును ఆయన విజ్జప్తి మేరకు కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి సీఎం కేసీఆర్ చెల్లించారు.

కొండ గట్టు అంజన్నకు కట్టిన ముడుపును సీఎం కేసీఆర్ చేతులమీదుగా చెల్లించడం సంతోషంగా ఉందని అనిల్ కూర్మాచలం తెలిపారు.  ఉద్యమంలో కేసీఆర్ దీక్ష చేస్తున్నప్పుడు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ..లండన్ లో ఉన్న సమయంలో  50 ఫౌండ్లను  ముడుపుకట్టినట్లు వెల్లడించారు.  ఆ మొక్కును సీఎం కేసీఆర్ తో వచ్చి తీర్చుకుందామని ఇన్నేండ్లు నుంచి ఎదురుచూసినట్లు చెప్పారు.  కొండగట్టు అంజన్న పర్యటన సందర్భంగా తన విన్నపాన్ని మన్నించి ముడుపును సిఎం కేసీఆర్ అంజన్న హుండీలో వేయించడాన్ని  జీవితంలో మరిచిపోలేనన్నారు.