
ప్రజాగాయకుడు గద్దర్ భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. అల్వాల్ లోని గద్దర్ ఇంటికి వచ్చిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ,పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాసేపట్లో మహభోది స్కూల్ గ్రౌండ్ లో ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
అంతకుముందు ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, గన్ పార్క్, ప్యాట్నీ, జేబీఎస్ మీదుగా అల్వాల్ వరకు గద్దర్ అంతిమ యాత్ర జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు అంతిమ యాత్ర జరిగింది. గద్దర్ కడచూపు కోసం అభిమానులు, కవులు కళాకారులు భారీగా తరలివచ్చారు. రోడ్లన్ని కిక్కిరిసి పోయాయి.
ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన గద్దర్ ఆగస్టు 6 మధ్నాహ్నం తుదిశ్వాస విడిచారు.