మంత్రి ప్రశాంత్​రెడ్డి తల్లికి కేసీఆర్ ​నివాళి

  • మంత్రి ప్రశాంత్​రెడ్డి తల్లికి కేసీఆర్ ​నివాళి
  • మంత్రిని ఓదార్చిన ఎంపీ అర్వింద్

నిజామాబాద్, వెలుగు :  వేముల ప్రశాంత్​రెడ్డి తల్లి వేముల మంజులమ్మ పార్థివదేహానికి సీఎం కేసీఆర్​నివాళి అర్పించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​లో వేల్పూర్​ మండల కేంద్రానికి చేరుకున్నారు. తల్లి మరణంతో దుఖంలో ఉన్న ప్రశాంత్​రెడ్డిని ఓదార్చారు. మంజులమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సుమారు పది నిమిషాలు అక్కడ ఉండి హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమయ్యారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్​కుమార్​సీఎం వెంట ఉన్నారు. 

స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి, మంత్రులు నిరంజన్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్​రెడ్డి, మహ్మద్​షకీల్, గణేశ్​గుప్తా, డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్​రెడ్డి తదితరులు ప్రశాంత్​రెడ్డిని ఓదార్చారు. సీఎం కేసీఆర్​వెళ్లాక మంజులమ్మ అంతమ యాత్ర ప్రారంభించగా చిన్న కొడుకు అజయ్​రెడ్డి తల్లి చితికి నిప్పంటించారు. 

సీఎం కేసీఆర్​ రావడానికి ముందు ఎంపీ అర్వింద్.. మంత్రి ప్రశాంత్​రెడ్డి ఇంటికి వెళ్లి మంజులమ్మ పార్థి వదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రిని పరామర్శించారు. ఎంపీ వెంట బీజేపీ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్​ బస్వా లక్ష్మినర్సయ్య, పల్లె గంగారెడ్డి, ఏలేటి మల్లికార్జున్​రెడ్డి, మోహన్​రెడ్డి ఉన్నారు.