మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో నాశనం అయింది: కేసీఆర్

కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉండేదని సీఎం కేసీఆర్ చెప్పారు. మూసీ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ హయాంలో నాశనం అయిందని విమర్శించారు. తెలంగాణ గాడిన పడిందని..కాంగ్రెస్ వస్తే అంతే సంగతి చెప్పారు. తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ అని.. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసరికి కరెంట్, నీళ్లు లేవన్నారు. సూర్యాపేట బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. 

కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడతున్నారని... కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలంతా ఆలోచించాలని చెప్పారు. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్ నుంచి అని వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధును రూ. 16వేలకు పెంచుతామని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో 3కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినమన్నారు

పెన్షన్ రూ. 200 నుంచి రూ. 2 వేలకు పెంచామని కేసీఆర్ చెప్పారు. పెన్షన్ దశలవారిగా రూ. 5016కు పెంచామన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. రైతుబంధు దుబారా అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు.. మరి రైతుబంధు దుబారానా అని కేసీఆర్ ప్రశ్నించారు.

ధరణి తీసేసి.. బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు.. ధరణి తీసేసి.. భూమాతా తీసుకస్తామంటున్నారు.. అది భూమాతనా.. భూమేతనా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆగం కావద్దని.. అన్ని పార్టీల గురించి చర్చలు సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేయాలని కేసీఆర్ చెప్పారు.