సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మీ చేతితో మీ కన్నునే పొడుస్తుంది.. జాగ్రత్త అని కేసీఆర్ చెప్పారు. ఎవరో చెప్పారని ఓటేస్తే.. ఆ ఓటే మనల్ని కాటేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామంటున్నారని తెలిపారు. తెలంగాణకు ఇప్పుడు పెద్ద ప్రమాదం రాబోతుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసని.. పదేళ్లలో తెలంగాణ సర్కార్ ఏం చేసిందో చూశారన్నారు కేసీఆర్. 3 గంటల కరెంట్ చాలని చెప్తున్న రేవంత్ రెడ్డి.. రైతులకు 10HP మోటార్లు ఎవరు కొనిస్తారని నిలదీశారు.
మెదక్ పరిసర ప్రాంతాల ప్రజలకు సాగునీరు పుష్కలంగా అందుతుందని చెప్పారు. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణనే నంబర్ వన్ గా నిలిచిందని ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.